ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పు సర్వ సాధారణం అయిపోయాయి. చిన్న వయస్సు వాళ్లు కూడా మోకాళ్ల నొప్పుల బారిన పడుతూ ఉండటంతో వాళ్లలో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మోకాళ్ల నొప్పులకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇతర కాలాలతో పోల్చి చూస్తే శీతాకాలంలో ఈ మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయని చెప్పవచ్చు.
ఒకసారి మోకాళ్ల నొప్పులు మొదలైతే ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో పరిష్కారం లభించడం సులువైన విషయం కాదు. మోకాళ్ల నొప్పులు మొదలైతే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ కొన్ని యోగాసనాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. నౌకాసనం, శశాంకాసనం నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.
ఎక్కువ బరువు ఉన్నవాళ్లు బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలు సైతం మోకాళ్ల నొప్పుల విషయంలో సమర్థవంతంగా పని చేస్తాయి. కొబ్బరినూనెలో కర్పూరం వేసి వేడి చేసి మోకాళ్లకు మర్ధనా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. జీలకర్ర, మిరియాలు, మెంతులు పిండిలా చేసుకుని రోజూ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ చిట్కాలు, వ్యాయామాలను పాటించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మోకాళ్ల నొప్పుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది.
