30 ఏళ్లు వచ్చిన వాళ్లకు అలర్ట్.. మీ ఆహారంలో ఈ కీలక మార్పులు తప్పనిసరి!

ప్రస్తుత కాలంలో జీవనశైలి వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తీసుకునే ఆహారంలో పొరపాట్లు, వ్యాయామం చేయకపోవడం ఎక్కువగా ఈ సమస్యకు కారణమవుతుంది. అయితే వయస్సు 30 సంవత్సరాలు దాటిన వాళ్లు ఆహారంలో కొన్ని మార్పులను కచ్చితంగా చేసుకోవాలి. 30 సంవత్సరాల వయస్సు దాటితే జీవక్రియలు నెమ్మది అవుతాయని చెప్పవచ్చు. ఫలితంగా జీవన శైలి వ్యాధుల బారిన పడే ఛాన్స్ పెరుగుతుంది.

ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. వయస్సు 30 దాటిన వాళ్లు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఉప్పు, చక్కెర వీలైనంత తగ్గించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరీ ఎక్కువ కారంతో చేసిన వంటకాలను సైతం తక్కువగా తినడానికి ఆసక్తి చూపించకుండా ఉంటే మంచిది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభించడంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. స్టార్చ్ తక్కువగా ఉన్న కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.

30 ఏళ్లు దాటిన వాళ్లు మద్యానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. వయస్సు పెరుగుతున్న వాళ్లు ప్రాసెస్డ్ మాంసాహారానికి సైతం వీలైనంత దూరంగా ఉండాలి. 30 ఏళ్లు దాటిన తర్వాత కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.