మహిళలలో చాలామంది పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ చేసుకునే పనులకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పిని సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ పీరియడ్స్ సమయంలో ఎన్నో సమస్యలు వేధిస్తాయి.
తీవ్రమైన నొప్పితో బాధపడే వాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నొప్పి నుంచి సులువుగా ఉపశమనం పొందవచ్చు. నెలసరి సమయంలో పుష్కలంగా నీటిని తాగడంతో పాటు బొప్పాయి పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి పండ్లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో బెల్లం కూడా తోడ్పడుతుందని చెప్పవచ్చు.
బెల్లం తినడం ద్వారా శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ సాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉన్న బెల్లం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. పీరియడ్స్ సమయంలో విపరీతమైన రక్తస్రావం జరుగుతుంటే కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సమస్యలు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
నెలసరి సమయంలో వచ్చే నొప్పికి ఎండోమెట్రియోసిస్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్, గర్భాశయ ఫైబ్రాయిడ్లు కారణమవుతాయి. నొప్పి తరచూ వేధిస్తుంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా సమస్యను సులువుగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.