రూ.500 నోట్లు నిజంగానే రద్దవుతాయా.. రద్దైతే మాత్రం ప్రజలకు ఆ కష్టాలు తప్పవా?

ఈ మధ్య కాలంలో నోట్ల రద్దు అనే పదం వినబడితే సామాన్యులు సైతం ఒకింత భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు కాగా కొంతకాలం క్రితం 2000 రూపాయల నోట్లు కూడా రద్దైన సంగతి తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో 500 రూపాయల నోట్లు సైతం రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

డిజిటల్ ఇండియాలో భాగంగా 200 రూపాయల కంటే ఎక్కువ మొత్తం విలువ ఉన్న నోట్లను చలామణిలో లేకుండా చేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు కొన్నిరోజుల క్రితం మహానాడులో భాగంగా 500 నోట్ల రద్దు గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి.

ఒకవేళ నిజంగా 500 రూపాయల నోట్లు రద్దైతే ప్రజలు పడే కష్టాలు మాత్రం మామూలుగా ఉండవు. నోట్ల రద్దు జరిగితే ప్రజలకు మాత్రం కష్టాలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చదువు ఉన్నవాళ్లు యూపీఐ సేవలను ఉపయోగించుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ చదువు రాని వాళ్లు మాత్రం యూపీఐ సేవల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

500 రూపాయల నోట్ల రద్దు దిశగా అడుగులు వేయకుండా ఉంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 500 రూపాయల నోట్ల రద్దు అనే వార్తలు ప్రజలను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.