భక్తుల హృదయాల్లో కృష్ణామృతం పారే రోజునే జన్మాష్టమి. ఈసారి ఆ ఆనందానికి మరింత రెట్టింపు కానుంది. ఎందుకంటే, 190 ఏళ్ల తర్వాత అపూర్వమైన గ్రహ యోగాలు ఒకే రోజున కలిసివస్తున్నాయి. భక్తుల పండుగ మాత్రమే కాదు, జ్యోతిష్య పరంగా కూడా ఈ జన్మాష్టమి కొందరి జీవితాల్లో ఆనంద బరితం చేయనుంది. శ్రీకృష్ణ జన్మోత్సవం అంటే ఆనందం, ఉత్సాహం, భక్తి కలగలిసి ఉత్సవం.
ఈసారి ఆ భక్తి ఉత్సవానికి ఆకాశం నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభించబోతున్నాయి. 1835లో జరిగినట్లే, చంద్రుడు తన ఉచ్ఛ రాశి వృషభంలో, సూర్యుడు తన సొంత సింహరాశిలో, బృహస్పతి మిథునరాశిలో, కుజుడు కన్యారాశిలో విహరించనున్నాడు. ఈ అద్భుత యాదృచ్ఛికం 190 ఏళ్ల తర్వాత మళ్లీ పునరావృతం అవుతోంది.
ఈ అరుదైన గ్రహస్థితిలో అమృత సిద్ధి యోగం, గజలక్ష్మి యోగం, రాజరాజేశ్వర యోగం లాంటి శుభకారక సమయాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగాలు సంపద, గౌరవం, విజయాన్ని ప్రసాదించే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా 5 రాశుల వారు ఈ పుణ్యకాలంలో కృష్ణుడి వరప్రసాదాన్ని పొందబోతున్నారు.
వృషభ రాశి: వృషభ రాశి వారు ఈసారి గజలక్ష్మీ రాజ్యయోగం వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. సంతాన సాఫల్యం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశీర్వాదం లభించే సమయం ఇది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు రావచ్చు.
మిథున రాశి: మిథున రాశి వారికి లగ్నంలో గురు-శుక్రుల కలయిక ఏర్పడుతుంది. ఇది వీరికి సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి లాభం, పెట్టుబడులపై మంచి రాబడి పొందే అవకాశం ఉంది. కెరీర్‌లో స్థిరత్వం పెరుగుతుంది.
సింహ రాశి: సింహ రాశి వారికి సూర్యుడు స్వరాశిలో ఉండటం వల్ల కొత్త గౌరవాలు, గుర్తింపు లభిస్తాయి. వివాహ యోగాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. వృత్తి స్థాయిలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు ఈ జన్మాష్టమి గజలక్ష్మి యోగం ప్రభావంతో కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి పొందుతారు. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. పాత కష్టాలు తొలగి కొత్త ఉత్సాహం నింపుతుంది.
మిగతా రాశులకూ ఈ గ్రహ కలయిక పాజిటివ్ ప్రభావాన్ని చూపనుంది. భక్తితో, శ్రద్ధతో కృష్ణుడిని పూజించే వారు సుఖసంతోషాలతో నిండిన కొత్త అధ్యాయం ప్రారంభిస్తారు. ఈ జన్మాష్టమి కేవలం పండుగ కాదు.. ఆకాశం భూమికి పంపే ప్రత్యేక వరం. కృష్ణ భక్తి, గ్రహ అనుగ్రహం కలిసొచ్చే అరుదైన సమయం.
