పరీక్షల సమయంలో పిల్లల మెదడు చురుగ్గా పనిచేసేలా, ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను ఇవ్వడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి పిల్లల ఆహారంలో భాగం చేయడం ద్వారా పిల్లల మెదడు చురుకుగా పని చేసే అవకాశాలు అయితే ఉంటాయి.
పిల్లలకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. పాలు, పెరుగు, పన్నీర్, గుడ్లు, చేపలు, చికెన్ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. పప్పులు, శెనగలు, సోయాబీన్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆకుకూరలు, క్యారెట్, బంగాళదుంపలు, బ్రోకలీలలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నారింజ, ద్రాక్ష, బొప్పాయి తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఓట్మీల్, బ్రౌన్ రైస్, తక్కువ నూనెతో చేసిన ఆహారాలు నీరు, పళ్లరసాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. అదే సమయంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు పిల్లలు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మైదా, పంచదారతో చేసిన ఆహారాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.
కాఫీ, టీలకు సైతం పిల్లల్ని దూరంగా ఉంచితే మేలు జరుగుతుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పరీక్షల సమయంలో ఉత్తమ ఆహారం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో బీ కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయని చెప్పవచ్చు. ఇవి ఎక్కువ మొత్తంలో