మనలో ఎంతోమందికి ఇష్టమైన పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, గల్లిక్ యాసిడ్, ఎపికాటెచిన్‌లు ఉంటాయని చెప్పవచ్చు. స్టార్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప నష్టం లేదు. గుండెపోటు, మధుమేహం, అథెరోస్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడంలో స్టార్ ఫ్రూట్ తోడ్పడుతుంది. జీర్ణాశయం సరిగ్గా పనిచేయడానికి స్టార్ ఫ్రూట్ సహాయపడుతుంది.
ఈ పండు నీటి నిలుపుదలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల సులువుగానే బరువు తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్ మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుందని ఇమ్యూనిటీని పెంచుతుందని చెప్పవచ్చు.
పెద్ద మొత్తంలో స్టార్ ఫ్రూట్ లేదా స్టార్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంపై విషపూరిత ప్రభావాలు ఉంటాయని చెప్పవచ్చు. కిడ్నీ సమస్యలు ఉంటే లేదా కొన్ని మందులు తీసుకుంటే స్టార్ ఫ్రూట్ తీసుకునే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్టార్ ఫ్రూట్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందనే సంగతి తెలిసిందే.
ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. ఈ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండగా ఇమ్యూనిటీ పవర్ సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభించే విషయంలో స్టార్ ఫ్రూట్స్ తోడ్పడతాయి. గ్యాస్, ఎసిడిటీ తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి.
