మనలో చాలామంది పొట్లకాయ తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే పొట్లకాయ తినడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాములా కనిపించే పొట్లకాయ శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్లకాయ వ్యాధుల నుంచి మనల్ని ఎంతగానో రక్షిస్తుంది. పొట్లకాయ కూరగాయలలో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉండగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఈ కూరగాయ ద్వారా పొందవచ్చు.
పొట్లకాయ తినడం ద్వారా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, అయోడిన్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. శాఖాహారులకు పొట్లకాయల వల్ల కలిగే లాభం అంతాఇంతా కాదు. మధుమేహ రోగులకు పొట్లకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిక్ రోగులు చింతించకుండా పొట్లకాయను ఆహారంలో తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి తోడ్పడతాయి.
పొట్లకాయ తినడం ద్వారా థైరాయిడ్ పనితీరును సరి చేయవచ్చు. జీర్ణవ్యవస్థను చక్కదిద్దే విషయంలో ఇది తోడ్పడుతుంది. కిడ్నీని డిటాక్స్ చేసి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. కిడ్నీతో పాటు శరీరంలోని అనేక భాగాలను పొట్లకాయ సహాయంతో శుభ్రం చేసే ఛాన్స్ ఉంటుంది. రక్తపోటు రోగులకు పొట్లకాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలుస్తోంది.
లైకోపీన్, బయోఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఈ కూరగాయలలో ఉన్నాయని సమాచారం అందుతోంది. మగవాళ్లలో శృంగార సమస్యలకు చెక్ పెట్టడంలో పొట్లకాయ తోడ్పడుతుంది. పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. వారానికి కనీసం ఒకసారి అయినా పొట్లకాయను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.