ప్యాకెట్ పాలు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ పాల వల్ల ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది ప్రతిరోజూ ప్యాకెట్ పాలనే వినియోగిస్తూ ఉంటారు. ప్యాకెట్ పాలు రుచికరంగా ఉండటంతో పాటు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం కూడా ఈ పాలను ఎక్కువగా వినియోగించడానికి ఒక కారణమని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలకు పాలు ప్రధాన పోషకాహారం కాగా స్వీట్లు, వంటలు, వివిధ రకాల పానీయాల తయారీలో సైతం పాలను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే.

సాధారణంగా పాల ప్యాకెట్లలోని పాలు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా పాలలో హానికరమైన బ్యాక్టీరియా అప్పటికే నిర్మూలించబడి ఉన్న పాలు అనే సంగతి తెలిసిందే. ఈ పాలను మళ్లీ వేడి చేయడం వల్ల ఈ పాలలోని పోషకాలు పూర్తిస్థాయిలో నశించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్యాకెట్ పాలను అతిగా మరిగించడం వల్ల ఆ పాలు పండ్లలోని గుజ్జులాగా మారే అవకాశాలు అయితే ఉంటాయి.

పాలు తాగడం వల్ల కాల్షియం లభించి ఎముకలు బలపడతాయి. పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండగా ఇవి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి సైతం మేలు జరుగుతుంది. పాలు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన డి విటమిన్ సైతం లభిస్తుంది. పాలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ, పేగు ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.

ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంట నుండి ఉపశమనం లభించే విషయంలో పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నీరసంగా అనిపించినప్పుడు పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి లభించే అవకాశం ఉంటుంది. పాలు ఎక్కువగా తాగేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.