ఇంట్లో గుమ్మం దగ్గర ఇవి ఉన్నాయా అయితే ఏం జరుగుతుందో చూడండి?

మన జీవన విధానంలో వాస్తు అనేది అవసరమా అని అంటే అది చాలా ముఖ్యం అని అంటారు జ్యోతిష్య పండితులు. మనం మన ఇళ్లల్లో ఏది ఎక్కడ ఉంచాలో ఇప్పుడు చూద్దాం. మన ఇంటి గుమ్మనికి అటువైపు ఇటువైపు రెండు చుక్కల పాలు వేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని బలంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.

ఉదయం నిద్ర లేవగానే పాలవాడు గుమ్మం దగ్గర పాల ప్యాకెట్లు వేసి వెళ్లి ఉంటాడు. అది చాలా పొరపాటు దానివల్ల చాలా కష్టాలు కూడా ఎదురవుతాయి. పాల ప్యాకెట్లను కింద కాకుండా పక్కన ఒక సంచిలాగా ఉంచి అందులో పాల ప్యాకెట్లు వేయమని చెప్పాలి, కింద వేయడం అస్సలు మంచిది కాదు. అలాగే ఉదయం ఆ పాల ప్యాకెట్ లు తీసుకున్నాక వెంటనే రెండు చుక్కలు గుమ్మానికి అవతల ఇవతల వేసినట్లయితే మంచిది.

ఇంట్లో ఏ దుష్టశక్తులు, గాలి వంటివి రాకుండా ఉండాలంటే క్రిస్టల్ తో చేసిన విగ్రహాన్ని ఉంచినట్లయితే ఇంటికి వచ్చే అనేక సమస్యలు త్వరగా తీరిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో ఒక గిన్నెలో పక్షుల కోసం కొంత నీరు ఉంచినట్లయితే ఇంట్లో సంపాదన అభివృద్ధి కలుగుతుంది అంటుంది కుటుంబ శాస్త్రం.

దుకాణం లేదా కార్యాలయం తూర్పు ఉత్తర దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం అగరబత్తీలు వెలిగిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. తరువాత చలువ రాయి అనేది మనతోపాటు ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే చలువ రాయి ఎక్కడ ఉంటే అదృష్టం అక్కడే ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లో నిర్మించే మెట్లు ఎప్పుడు కుడి వైపుకే ఉండాలి. ఒకవేళ అలా నిర్మించడానికి వీలుకాని పరిస్థితులలో కనీసం మొదటి మెట్టైనా కుడి వైపుకు ఉన్నట్టు నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు ఇంకా అష్ట ఐశ్వర్యాలకు డోకా ఉండదు. ముఖ్యంగా ఇంట్లో నైరుతి భాగంలో బరువు ఎక్కువగా ఉండే విధంగా నిర్మించుకోవాలి. అప్పుడు దురదృష్టం చెంతచెరదు. తరువాత సాయంత్రం వేళ మంత్రాలు వినపడేటట్టు రేడియో లేదా క్యాసెట్ పెట్టుకుంటే అదృష్టం ఉత్పన్నం అవుతుంది. ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.