ఉదయం నిద్ర లేవగానే.. ఇవి కంటపడితే రోజంతా దరిద్రమే..!

మన దేశంలో ఎన్నో ప్రాచీన సంప్రదాయాలు ఉన్నా వాటిలో కొన్ని ఇప్పటికీ ప్రజలు గౌరవంగా పాటిస్తుంటారు. ముఖ్యంగాఉదయం ప్రారంభానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే మనం రోజు మొత్తం ఎలా ఉంటామో, ఆ రోజు మన పని ఎలా ఉంటుందో కొంత వరకు మన ఉదయం ఎలా ప్రారంభమవుతుందో ఆధారపడుతుందనే నమ్మకం భారతీయుల్లో ఉంది. అందుకే పెద్దలు ఉదయం లేవగానే కొన్ని దృశ్యాలను చూడకూడదు అని చెబుతుంటారు.

ఉదయం నిద్ర లేవగానే అద్దం.. లేదా పగిలిన అద్దాని చూడటం అశుభమని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అంతేకాదు.. చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను కూడటం కూడా మంచిది కాదంట. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంటి శుభ్రత, క్రమబద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ఎందుకంటే ఇల్లు బాగుంటేనే శుభఫలితాలు కలుగుతాయని.. గజిబిజిగా ఉంటే ఆటంకాలు తప్పవని అంటారు.

ఇలాగే వంటగదిలో ఎంగిలి ఖాళీ పాత్రలు ఉండటం కూడా మంచిది కాదు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఎంగిలి ఖాళీ పాత్రలు పేదరికానికి సంకేతం. అదే ఇంటి బయట చెత్తకుప్పలు కనిపిస్తే అది ప్రతికూల శక్తి చుట్టూ ఉందని సూచిస్తుంది. అందుకే ప్రతి రోజు ఉదయం ఇల్లు క్లీన్ గా ఉంచాలి, చెత్త వెంటనే తొలగించాలని సూచిస్తున్నారు.

కేవలం వస్తువులు మాత్రమే కాదు.. ఉదయం లేచిన వెంటనే ఎవరైనా గొడవ పడుతూ, కొట్టుకుంటూ కనిపిస్తే అది కూడా మంచిది కాదంట. అది మనలోకి ఆగ్రహాన్ని, వివాదాలను తీసుకువస్తుందనే నమ్మకం కొందరికి ఉంది. అలాగే నిద్రలో కలలు రావడం సహజం.. కానీ ఆ కలలు హింసాత్మకంగా, భయానకంగా ఉంటే వాటి ప్రభావం కూడా మన మీద పడుతుందంటారు. అలాంటి కలలు మనసుని కలత పెడతాయి.. రోజంతా ఉలికిపడేలా చేస్తాయని చెబుతున్నారు. ఇక ఉదయాన్నే అనారోగ్యంతో బాధపడే వ్యక్తిని చూడటాన్ని కూడా మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే అది నెగటివ్ ఎనర్జీని వ్యాప్తి చేస్తుందని పెద్దల నమ్మకం.

ఉదయం ఏవి చూడాలి: ఉదయాన్నే దేవుని నామస్మరణ చేయడం, ప్రేరన కలిగించే ఆలోచనలు చేయడం, సానుకూల మాటలు మాట్లాడుకోవడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.. వస్తువులు చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవడం, వంటగదిలో ఖాళీ పాత్రలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. సమకాలిక జీవన విధానంలో చాలా మంది ఇవి తక్కువగా పట్టించుకుంటున్నా, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నెగటివ్ ఎనర్జీ దరిచేరదని పెద్దలు చెబుతున్నారు. దాంతో పాటు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు.