సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.2.60 లక్షల వేతనంతో?

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2024 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మేనేజర్, సూపర్‌వైజర్, సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా
భర్తీ చేయనున్నారు.

మొత్తం 40 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఏజీఎం, డీజీఎం, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగాలను సైతం భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.2.60 లక్షల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారీ వేతనం అందిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

సంబంధిత వయోపరిమితిని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర సందేహాలకు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.