నిరుద్యోగులకు తీపికబురు.. 2250 రైల్వే పోలీస్ ఉద్యోగాలకు భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. యూనిఫాం ఫోస్టులను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధం కాగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 2250 రైల్వే పోలీస్ ఉద్యోగాలకు భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎగ్జిక్యూటివ్), కానిస్టేబుల్స్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగ ఖాళీలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

2,000 కానిస్టేబుల్‌ పోస్టులు, 250 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో 10 శాతం ఖాళీలను మాజీ సైనికులకు, 15 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించడం గమనార్హం. త్వరలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు కాగా ఎస్సై ఉద్యోగానికి 20 సంవత్సరాలుగా ఉంది.

25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఆర్పీఎఫ్ ఎస్సై ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. కనీసం పదో తరగతి పాసైన వాళ్లు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. rpf.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ డీటేల్స్ అందించి ఈ ఉద్యోగాల కొరకు రిజిష్టర్ అవ్వాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి జీతం నెలకు గరిష్టంగా 32 వేల రూపాయల వరకు లభించనుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను మొత్తం 3 దశలలో ఎంపిక చేయడం జరుగుతుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలకు చెక్ పెట్టవచ్చు.