రోబోటిక్ సర్జరీల వల్ల మేలేనా.. రోబోటిక్ సర్జరీల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వైద్యులు ఆపరేషన్లలో ప్రస్తుతం అత్యాధునిక రోబోటిక్ పరికరాలను ఉపయోగించడం జరుగుతోంది. రోబోటిక్ పరికరాలతో ఆపరేషన్లు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కాలంలో జాయింట్ రిప్లేస్మెంట్‌ సర్జరీలు ఎక్కువగా జరుగుతుండగా ఈ సర్జరీలకు రోబోటిక్ విధానం ఎంతో అనుకూలమని చెప్పవచ్చు.

రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ పరికరాల సహాయంతో చేసే ఆపరేషన్లు అని చెప్పవచ్చు. ఆపరేషన్ అత్యంత కచ్చితత్వంతో చేసేందుకు రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. సంక్లిష్ట శస్త్రచికిత్సలైన జాయింట్ రిప్లేస్మెంట్‌కు రోబోటిక్ సర్జరీలు ఎంతో అనుకూలం అని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోబోటిక్ పరికరాలను వినియోగించడం వల్ల శరీర భాగాలకు భారీగా కోతలు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు.

ఈ విధానంలో రక్తస్రావం కూడా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధానంలో ఆపరేషన్ తరువాత రోగి త్వరగా కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. రోబోటిక్ ఆపరేషన్లలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటంతో పాటు ఆపరేషన్లు సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే సాధారణ ఆపరేషన్లతో పోల్చి చూస్తే ఈ ఆపరేషన్లకు అయ్యే ఖర్చు కొంతమేర ఎక్కువని చెప్పవచ్చు.

ఈ సర్జరీలు చేయడానికి డాక్టర్లు సైతం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వైద్యులకు సహాయం చేయడం కోసం ఉద్దేశించబడిన విధానం అని చెప్పవచ్చు. ఈ విధానంలో చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. రోబోటిక్ సర్జరీ వల్ల లాభాలే తప్ప నష్టాలు అయితే లేవు.