పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పోస్టాఫీసులో అనేక చిన్న పొదుపు పథకాలు ఉండగా ఈ పథకాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ బెస్ట్ స్కీమ్స్ లో ఒకటిగా ఉంది.
ఎవరైతే ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు ఎక్కువ మొత్తం వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. వినియోగదారుడు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రతి నెలా వడ్డీని పొందవచ్చు. దేశంలోని మధ్యతరగతి ప్రజలు డబ్బును డిపాజిట్ చేయడానికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 7.5 శాతంగా ఉండగా ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై నెలకు రూ.5,550 వడ్డీ రూపంలో లభించే ఛాన్స్ అయితే ఉంటుంది.
స్కీమ్ ముగిసిన తర్వాత రూ. 9 లక్షలు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉండటంతో ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ కావడంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వినియోగదారులకు లాభదాయకమైన స్కీమ్స్ లో ఈ స్కీమ్ కూడా ఒకటిగా ఉండటం గమనార్హం.
ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలో పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.