ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు, తెలివిగా పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. అందుబాటు ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ప్లాన్స్ ను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొనిరావడం గమనార్హం. హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ పేరుతో ఈ స్కీమ్స్ అమలవుతున్నాయి.
ఈ స్కీమ్ తీసుకుంటే ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సంవత్సరం తర్వాత కూడా పాలసీని కొనసాగించాలని భావించే వాళ్లు ఇమిటేట్ చేసే అవకాశం ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ అనే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను ఎంచుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రజలకు ఇది ఎంతో బెస్ట్ స్కీమ్ అవుతుంది.
హెల్త్ ప్లస్ ప్లాన్ లో మూడు ఆప్షన్లు ఉండగా ఆప్షన్ 1లో భాగంగా 5 లక్షల రూపాయల బీమా పొందవచ్చు. రూ.50,000 వరకు పిల్లల పెళ్లికి అందించే కవరేజీ కూడా ఈ పాలసీలో ఉండటం గమనార్హం. ప్రమాదంలో ఎముకలు విరిగితే 25,000 రూపాయల బీమా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
హెల్త్ ప్లస్ ఆప్షన్ 1 వార్షిక ప్రీమియం పన్నులతో సహా 355 రూపాయలు అవుతుందని సమాచారం అందుతోంది. హెల్త్ ప్లస్ ఆప్షన్ 2 తీసుకుంటే 10 లక్షల రూపాయల బీమా పొందవచ్చు. ఈ స్కీమ్ తీసుకుంటే రూ.1 లక్ష వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీ వార్షిక ప్రీమియం పన్నులతో సహా రూ. 555 కావడం గమనార్హం.