గులాజి జామకాయలు తింటే కళ్లు చెదిరే ప్రయోజనాలు.. షుగర్ తో పాటు ఇతర సమస్యలకు చెక్!

ప్రస్తుతం మార్కెట్ లో తెల్పు రంగులో ఉండే జామకాయలతో పాటు గులాబీ రంగులో ఉండే జమమకాయలు అందుబాటులో ఉన్నాయి. గులాబీ జామకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పోటాషియం, లైకోపీన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణాశయాన్ని మెరుగుపరచడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

గులాబీ జామకాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గులాబీ జామకాయలు తోడ్పడతాయి. హృదయాన్ని రక్షించడంలో గులాబీ జామకాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బహిష్టు నొప్పిని తగ్గించడంలో ఈ పండ్లకు తిరుగులేదని చెప్పవచ్చు. జీర్ణాశయాన్ని మెరుగుపరచడంలో ఈ పండ్లు తోడ్పడతాయి.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పండ్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడతాయి. బరువు తగ్గడంలో ఈ పండ్లు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. వాపును తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి. శరీరంలో ద్రవ స్థాయిలను సమతుల్యం చేయడంలో గులాబీ జామకాయలు కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ జామకాయలో ఉండే కెరోటినాయిడ్ అనే సేంద్రీయ వర్ణద్రవ్యం వల్ల దీని రంగు లేత గులాబీ నుండి ముదురు గులాబీ వరకు ఉంటుంది.

పింక్ జామకాయలో ఎన్నో పోషకాలు ఉండగా ఆరోగ్యాన్ని పెంచడంలో ఈ పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 7 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. విటమిన్ సి లోపంతో బాధ పడే వాళ్లకు ఈ పండ్లు మేలు చేస్తాయి. మసాలా చల్లి జామకాయలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.