మనలో చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం డిపాజిట్ చేసిన డబ్బుకు సెక్యూరిటీ ఉందని భావిస్తారు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో మంత్లీ ఇన్ కం స్కీమ్ బెస్ట్ స్కీమ్ కాగా భార్యాభర్తలు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఆకర్షణీయ స్థాయిలో వడ్డీ ఉండటం వల్ల కూడా ఎక్కువమంది ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడంపై దృష్టి పెడుతున్నారు.
ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి కావడంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నష్టపోయే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు గ్యారంటీ రిటర్న్స్ పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. జాయింట్ అకౌంట్ తీసుకున్నవాళ్లు ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదేళ్లకు 5.5 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది.
ఒకవేళ 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మాత్రం ఐదేళ్లకు రూ. 185000 వడ్డీ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. ముందే డబ్బును విత్ డ్రా చేసుకుంటే కొంత మొత్తం నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుంది.
కనీసం 1000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ లో ఎక్కువ వడ్డీని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మంత్లీ ఇన్ కం స్కీమ్ ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.