బొప్పాయి గింజల్ని గంజిలో కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఆ సమస్యలకు చెక్!

మనలో చాలామంది బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. అయితే బొప్పాయి గింజల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బొప్పాయి గింజలను గంజిలో కలుపుకొని తాగడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బొప్పాయి గింజల ద్వారా శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయని చెప్పవచ్చు.

బొప్పాయి గింజలలో యు ఫాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆల్కనాయిడ్స్, విటమిన్ సి ఉంటాయి. పీరియడ్స్ సమస్యతో బాధపడే యువతులు, మహిళలకు ఆ సమస్యలకు చెక్ పెట్టడంలో బొప్పాయి గింజలు తోడ్పడతాయి. బొప్పాయి గింజలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని సైతం కచ్చితంగా కాపాడతాయని చెప్పవచ్చు. బొప్పాయి గింజలలో ఎక్కువగా ఉండే అధిక పీచు పదార్థం ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెప్పవచ్చు. బొప్పాయి గింజలను చూర్ణం చేసి పాలు లేదా గంజిలో కలిపి తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయని చెప్పవచ్చు. బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని వేడినీటిలో కలుపుకొని తాగితే మంచిది. బొప్పాయి వల్ల అలెర్జీలు ఉంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తినే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. బొప్పాయి పండ్లు తినడానికి ఎంతో రుచిగా ఉంటాయనే సంగతి తెలిసిందే. బొప్పాయి గింజలు తినే వాళ్లను కొన్ని సందర్భాల్లో ఇతర సమస్యలు వేధించే ఛాన్స్ ఉంది. శరీరతత్వాన్ని
బట్టి ఈ గింజలను తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
.