మనలో చాలామంది నారింజ పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. నారింజ పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయ్. నారింజ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. నారింజ పండు తినడం వల్ల ఎముకల నిర్మాణం, గాయం నయం, చిగుళ్ల ఆరోగ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు.
వాపుతో పోరాడే విషయంలో నారింజ పండ్లు ఉపయోగపడతాయి. ఉబ్బసం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి పరిస్థితుల తీవ్రతను తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి. వైరస్‌లు మరియు సూక్ష్మక్రిముల నుండి నారింజ పండ్లు రక్షిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈ పండ్లు తోడ్పడతాయి. మధుమేహంతో సహా ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ పండ్లు ఉపయోగపడతాయి.
నారింజ పండు తొక్కలను నీడలో ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని వాడుకోవచ్చు. దాంతో డికాషన్ తయారు చేసి తాగవచ్చు. నారింజ పండ్లు తినడం వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది. విటమిన్ సి లోపంతో బాధ పడేవాళ్లు ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. అంటువ్యాధుల నుంచి రక్షించే విషయంలో నారింజ పండు ఎంతగానో సహాయపడుతుంది.
కాలంతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా నారింజ పండ్లు తింటే మంచిది. నారింజ పండ్లు డైటరీ ఫైబర్ ను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. కంటిచూపును మెరుగుపరిచే విషయంలో కూడా ఈ పండ్లు తోడ్పడతాయని చెప్పవచ్చు.