పది, ఇంటర్ అర్హతతో 5369 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

Job-Vacancy

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ 5369 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వేర్వేరు కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పది, ఇంటర్, డిగ్రీ అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్, ఇతర పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. పరీక్షలో ప్రతి తప్పు జవాబుకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 27వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండగా మార్చి 28వ తేదీ ఆన్ లైన్ పేమెంట్ కు చివరి తేదీగా ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఉద్యోగాలకు గట్టి పోటీ ఉండనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. త్వరలో మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.

వరుస జాబ్ నోటిఫికేషన్లు నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు తమ అర్హత ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.