మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడి ఉంటారు. గొంతునొప్పి ఉంటే అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఉప్పునీరు, పసుపు నీరు కొండ నాలుకకు తగిలే విధంగా రెండు నిమిషాల పాటు పుక్కిలిస్తే మంచిది. సమస్య తీవ్రతను బట్టి రోజూ ఈ విధంగా చేయడం వల్ల తీవ్రమైన గొంతునొప్పి సమస్య నుంచి వేగంగా పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు.
దాహంతో గుటక వేసినా ముల్లు దిగినట్లు అనిపించే ఈ గొంతు నొప్పి వల్ల కొన్నిసార్లు ప్రశాంతమైన నిద్రకు కూడా భంగం కలుగుతుంది. ఆ సమయంలో కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకుని నమిలితే కొంతమేర ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మన ఇంట్లో దొరికే వస్తువులలో వెల్లుల్లికి యాంటీ సెఫ్టిక్ గుణం ఒకింత ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిని నమిలిన సమయంలో దాని నుంచి అలిసిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. వెల్లుల్లి పాయను ఒక బుగ్గన పెట్టుకుని 15 నిమిషాల పాటు నములుతూ రసాన్ని మింగడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. వెల్లుల్లి వగరు మరీ ఇబ్బందిగా ఉంటే తేనె కూడా తీసుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.
అల్లం టీ తాగడం ద్వారా కఫ సంబంధిత రోగాలకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సాధారణ వెజిటేబుల్ సూప్స్ తో పాటు చికెన్ సూప్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. తులసి ఆకులను నీళ్లలో కలిపి పావుగంట సేపు ఉంచి తర్వాత ఆ నీటిని తీసుకుంటే గొంతు సమస్య దూరం కావడంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిదని చెప్పవచ్చు.