మనలో చాలామంది జామకాయలు ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. జామకాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లు జామకాయలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ ను అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ ఒక విధంగా సైలెంట్ కిల్లర్ అనే సంగతి తెలిసిందే. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే వేర్వేరు అవయవాలపై ప్రభావం పడుతుంది.
కిడ్నీ, నరాలు, కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు షుగర్ కారణమవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకోవడం ద్వారా షుగర్ కు చెక్ పెట్టవచ్చు. జామకాయలో పోషకాలు మెండుగా ఉండటం వల్ల షుగర్ రోగులకు ఇది దివ్యౌషధం అని చెప్పవచ్చు. జామలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
టైప్2 డయాబెటిస్ రోగులకు జామలో ఉండే పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గేలా చేయడంలో జామ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. జామలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గడంతో పాటు అతిగా తినడాన్ని నియంంత్రిస్తుందని చెపవచ్చు. జామలోని పోషకాలు హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. డయాబెటిస్ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
జామలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల లాభాలు చేకూరుతాయి. శరీర కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంతో పాటు రాల సమస్యల ముప్పును తగ్గించడంలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. జామపండ్లను తినడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవనే సంగతి తెలిసిందే. జామ పండ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు చేకూరుతాయి.