భారీ వేతనంతో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో జాబ్స్.. ఆ అర్హతలతో?

ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. బీఈ, బీటెక్‌, పీజీడీఎం, డిగ్రీ, పీజీ, సీఏ, సీ.ఎం.ఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జులై 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

సీఏ లేదా సీఎమ్‌ఏ లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌ పాసైన వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్‌ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు మెకానికల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ పాసై ఉండాలి.

కనీసం ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లా డిగ్రీలో 55 శాతంతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉద్యోగ ఖాళీలు కేవలం 20 మాత్రమే ఉండటం గమనార్హం.

21 నుంచి 30 ఏండ్ల‌ మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు నెలకు రూ.35,000 వేతనం పొందవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు 354 రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా జులై 31వ తేదీలోపు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. https://esfc.ap.gov.in/careers.jsp ద్వారా ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.