ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన నార్తర్న్ కోల్డ్‌ఫీల్ట్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించిన మినీరత్న కంపెనీ సంవత్సరం ట్రైనింగ్ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడం గమనార్హం.
ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 380 ఉద్యోగ ఖాళీలు ఉండగా టెక్నికల్ డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు 320 ఉండటం గమనార్హం. నిన్నటినుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా ఆగష్టు నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://nclcil.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దరఖాస్తులను నింపి అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వేర్వేరు దశల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
గ్రాడ్యుయేట్స్ అప్రెంటీస్‌లకు రూ.15,208 స్టైఫండ్ కాగా డిప్లొమా అప్రెంటీస్‌లకు రూ.12,524 స్టైఫండ్ గా ఉండనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ కు సెలెక్ట్ కావడం ద్వారా సులువుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.