ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు.. లక్షల్లో వేతనంతో?

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భువనేశ్వర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 19 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. niser.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2023 సంవత్సరం మే నెల 29వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా కలిగి ఉండటంతో పాటు అర్హత, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీల ఆధారంగా వయస్సుకు సంబంధించి స్వల్పంగా మార్పులు ఉంటాయి. గరిష్టంగా 42 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 21,700 రూపాయల నుంచి 1,42,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుందని బోగట్టా.

రిజర్వేషన్ల ఆధారంగా దరఖాస్తు ఫీజులో స్వల్పంగా మినహాయింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. అధికారిక వెబ్ సైట్ లో టెక్నికల్ స్టాఫ్ పొజిషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి సులువుగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.