నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. nia.nic.in వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2023 సంవత్సరం జులై నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. రేడియాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఇతర ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి పని అనుభవం కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు వయో పరిమితులు ఉన్నాయి.
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు 18,000 రూపాయల నుంచి రూ. 1,77,500 వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. https://nia.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
హోమ్ పేజ్ లో రిక్రూట్మెంట్ ట్యాబ్ ను క్లిక్ చేసి లాగిన్ కావడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అభ్యర్థి వివరాలను నమోదు చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.