మిధానిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్.. మంచి వేతనంతో?

హైదరాబాద్ లో ఉన్న విశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తోంది. జూన్ నెల 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. జూన్ 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

అసిస్టెంట్ మేనేజర్ మెడికల్ ఒక ఉద్యోగ ఖాళీ ఉండగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ పాస్ కావడంతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఈ నెల 21వ తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల్ మధ్య ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీకి ఎంపికైన వాళ్లకు నెలకు 40 వేల రూపాయల నుంచి లక్షా నలభై వేల రూపాయల మధ్య వేతనం లభిస్తుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మేనేజర్ (హెచ్.ఆర్), కార్పొరేట్ ఆఫీస్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, కాంచన్ బాగ్ హైదరాబాద్ 500058 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2025 సంవత్సరం జూన్ 20వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

సంస్థ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే సంస్థ అధికారులను డైరెక్ట్ గా సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.