మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో మహాబీర విత్తనాల గురించి వినే ఉంటారు. ఈ విత్తనాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆయుర్వేదంలో ఈ విత్తనాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. కీళ్లు, కీళ్ల నొప్పులతో బాధ పడేవాళ్లకు మహాబీర విత్తనాలు దివ్యౌషధంలా పని చేస్తాయి. రాత్రి సమయంలో ఈ విత్తనాలను నీళ్లలో నానబెట్టుకుని తాగితే కీళ్లు, కాళ్ల నొప్పులు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.
సంప్రదాయ వైద్యులు ఈ విత్తనాలను తరచూ వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది ఈ విత్తనాలను వన తులసి అని పిలుస్తారు. ఈ విత్తనాలు నల్ల రంగులో త్రిభుజాకారంలో ఉంటాయి. మూడు నెలల పాటు మహాబీర విత్తనాలను నానబెట్టి తాగితే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మృదులాస్థి కణజాలం మళ్లీ ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు. చూడటానికి ఈ గింజలు సబ్జా గింజలలా ఉంటాయి.
మజ్జిగ, సలాడ్లు, ఫలూదాలలో వేసుకుని వీటిని తీసుకోవచ్చు. బరువు తగ్గించడంతో పాటు పేగుల్ని శుభ్రం చేయడంలో ఇవి తోడ్పడతాయి. మహాబీర విత్తనాలు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒత్తిడి, శ్వాస సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో ఇవి తోడ్పడతాయి. మహాబీర విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ తో కూడా పోరాడతాయి.
మహాబీర చెట్టు ఆకులను నూరి రసం తాగడంతో పాటు దురద ఉన్నచోట రాస్తే చర్మ సమస్యలు సైతం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. పగిలిన పాదాలకు ఈ రసాన్ని రాయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి. పాముకాటుకు సైతం విరుగుడుగా ఈ విత్తనాలు పని చేస్తాయని చెప్పవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా ఈ విత్తనాలను కొనుగోలు చేయవచ్చు.