మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ట్యూటర్/ డెమోన్‌స్ట్రేటర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.
బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ విభాగలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9వ తేదీ చివరి తేదీగా ఉంది.
అడ్మిన్ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా అడ్రస్ కు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు 56,000 రూపాయల వేతనం అంటే ఎక్కువ మొత్తమేనని చెప్పాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను సంస్థ వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.