మనలో చాలామంది టీ తాగడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తారు. చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. బెల్లంలో ఉండే గ్లూకోజ్ శరీరానికి అవసరమైన శక్తిని తక్కువ సమయంలోనే అందిస్తుందని చెప్పవచ్చు. బెల్లంలో ఉండే ఖనిజాలు, ఆంటీ యాక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి.
ప్రతిరోజూ బెల్లం టీ తాగడం వల్ల శరీరంలో ఉండే విషపూరిత పదార్థాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. బెల్లం టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని చెప్పవచ్చు. బెల్లంలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి. తగినంత బెల్లం తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుందని చెప్పవచ్చు. బెల్లం తీసుకోవడం ద్వారా జీవక్రియ ప్రక్రియ సైతం మెరుగుపడుతుంది.
బెల్లం టీ రెగ్యులర్‌గా తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం కావడంతో పాటు ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యను నివారించడంలో బెల్లం టీ ఉపయోగపడుతుంది. బెల్లంలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లం టీ జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు రక్తహీనతకు చెక్ పెడుతుంది. తక్షణ శక్తిని అందించడంతో పాటు మంచి నిద్రను సైతం అందిస్తుంది.
పంచదార వేసుకుని టీ తాగడం కంటే బెల్లంతో చేసిన టీ తాగడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని చెప్పవచ్చు. రోజువారీ ఫుడ్‌లో బెల్లాన్ని యాడ్ చేస్తే రక్తహీనత సమస్య దూరమవుతుంది.