కాలంతో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో చాలామందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో అయితే ఈ సమస్యలు మరింత ఎక్కువగా వేధిస్తాయి. చెమట చికాకు వల్ల చాలామంది చేయాలనుకున్న పనులను సవ్యంగా చేయలేకపోతున్నారు. మరి కొంతమంది అయితే అధిక చెమట వల్ల పడే ఇబ్బందులు అయితే అన్నీఇన్నీ కావు. ఫ్యాన్లు, కూలర్ల ముందు కూర్చున్నా కొంతమందిని ఈ సమస్య వేధిస్తుంది.
ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. హార్మోన్ల స్థాయిలో మార్పుల వల్ల చాలామందిని చెమట సమస్య వేధిస్తుంది. వేసవి కాలంలో వేడికి చెమట పడుతోందని చాలామంది భావిస్తారు. కొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండా తరచూ చెమటలు పడతాయి. చెమట నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌకర్యం కలిగించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.
శరీరంలో అధికంగా ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన విధి అని చెప్పవచ్చు. చర్మంపై ఉండే బాక్టీరియాకు చెమట తోడు కావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చంకలు, పాదాలు, అరచేతుల్లో ఎక్కువగా చెమట పట్టడం వల్ల చాలా సందర్భాల్లో అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఆత్రుత, ఆందోళన, మానసిక ఒత్తిడి, కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినడం వల్ల చెమట పట్టే అవకాశం అయితే ఉంటుంది. స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు అధికంగా పట్టే అవకాశాలు ఉంటాయి. అరికాళ్లు, అరచేతుల్లో అధిక చెమట పట్టడానికి కారణం శరీరంలోని ఉష్ణోగ్రత కంటే భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులే కారణం అని చెప్పవచ్చు. బ్లాక్ టీలో ముంచిన మెత్తని గుడ్డతో అరచేతులతో తుడిస్తే మంచిది. బ్లాక్ టీలోని ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సెపిరెంట్‌గా పని చేస్తుందని చెప్పవచ్చు.