ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధితో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హోమియోపతి మందులు వాడటం ద్వారా థైరాయిడ్ ను అదుపులోకి తీసుకొని రావచ్చు. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు తక్కువగా విడుదలచేస్తే హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషులతో పోల్చి చూస్తే మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో నెలసరి క్రమం తప్పడం, ప్రెగ్నెన్సీ కష్టం కావడం, అధిక బరువు, కంగారు, ఆందోళన ఇలా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
థైరయిడ్ కోసం అల్లోపతి మందులు వాడినా మందులు కొన్ని సందర్భాల్లో లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, క్యాలరీలు త్వరగా తగ్గిపోయి బక్కపలచగా అవడం, విపరీతమైన ఆకలి, కంగారు, ఆందోళన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే పూర్తిగా నయం చేయడం కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వ్యక్తి మానసిక స్థితి, శారీరక లక్షణాలు ఆధారంగా వైద్యులు మందులు సిఫార్సు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. నిర్దిష్ట కాలంపాటు రోగికి వివిధ రకాల మందు ఇచ్చి వ్యాధిని తగ్గించేలా మరో విధానం ఫాలో అవుతారు.