మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో నువ్వులను తీసుకుని ఉంటారు. నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. నువ్వులు ఎక్కువ ఫైబర్ ను కలిగి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. నువ్వుల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ మరియు పోషకాలు లభిస్తాయి.
నువ్వులను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా సులభంగా రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదలను నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. నువ్వులు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన బి విటమిన్ సులభంగా లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎర్ర రక్తకణాల నిర్మాణంలో నువ్వులు ఎంతగానో సహాయపడతాయి.
థైరాయిడ్ సమస్యతో పాటు ఎన్నో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు నువ్వులతో చెక్ పెట్టవచ్చు. నువ్వులు తీసుకోవడం ద్వారా ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్ లభిస్తాయి. అందుకే నువ్వులను పవర్ హౌజ్ అని పిలుస్తారు. నువ్వుల ద్వారా శరీరానికి లభించే కాల్షియం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తెల్ల నువ్వులతో పోల్చి చూస్తే నల్ల నువ్వులలో ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బ్రెయిన్ లో ట్యూమర్ గ్రోత్ ను నివారించడంలో నల్ల నువ్వులు సహాయపడతాయి. హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేయడంలో నువ్వులు తోడ్పడతాయి. నువ్వులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప ఏ మాత్రం నష్టం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.