పచ్చి అరటికాయతో అద్భుతమైన లాభాలు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మనలో చాలామంది అరటి కాయను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పచ్చి అరటికాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ లాభాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సాధారణంగా పచ్చి అరటికాయలో ఫినోలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పచ్చి అరటికాయ ప్రేగుల్లోకి మంచి బ్యాక్టీరియాను అందించడంతో పాటు కడుపు, చిన్నప్రేగుల ప్రక్రియను తట్టుకోగలవని చెప్పవచ్చు.

అధిక రక్తపోటు సమస్యతో బాధ పడేవాళ్లు పచ్చి అరటికాయ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ఇది తోడ్పడుతుంది. పచ్చి అరటికాయ తినడం వల్ల విటమిన్ సి, బీటా కెరాటిన్ తో పాటు ఇతర పోషకాలు సులభంగా లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు వాపును తగ్గిస్తాయి.

కూర, బనానా చిప్స్, అరటి గంజి చేసుకోవడంలో పచ్చి అరటికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అర‌టిలో అనేక పోష‌క విలువ‌లు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించ‌వ‌చ్చు అని వైద్యులు చెబుతున్నారు. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరకి కూడా రావు.

అరటి పండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి లేదా ఫ్రై చేసి తింటుంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీస్‌ను కూడా తయారుచేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది