ఉసిరికాయలను తిని విత్తనాలను పడేస్తున్నారా.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు!

మనలో చాలామంది ఉసిరికాయలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ఉసిరికాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తిన్నా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. జుట్టు, చర్మ సంరక్షణలో ఉసిరిది అందె వేసిన చెయ్యి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఉసిరి తీసుకోవడం వల్ల విటమిన్-సి పుష్కలంగా లభిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, వృద్దాప్యాన్ని దరి చేరనీయకుండా చేయడంలో, బరువు తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషించే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఉసిరికాయలను తిని విత్తనాలను పడేసే వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉసిరికాయ విత్తనాలు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు.

ఉసిరికాయ విత్తనాలు వాడితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉసిరికాయలో ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు. ఉసిరికాయ విత్తనాలు కూడా జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో కచ్చితంగా తోడ్పడతాయని చెప్పవచ్చు.

ఉసిరికాయ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండగా ఇవి చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఉసిరికాయ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉండగా ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మధుమేహం ఉన్నవారు ఉసిరికాయ, ఉసిరి విత్తనాలు రెండూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది.

ఉసిరికాయ విత్తనాలలో కూడా విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి తోడ్పడతాయి. పేలవమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఉసిరికాయను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.