డిగ్రీ చదివే విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. సులువుగా నెలకు రూ.10 వేల వేతనంతో?

దేశంలో కోట్ల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యార్థులలో చాలామంది కుటుంబం నుంచి ఆర్థికపరమైన సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ చేయాలని భావించినా చదువుకునే విద్యార్థులకు ఉద్యోగం దొరకడం సులువు కాదనే సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుభవార్త చెప్పింది.

విదేశాలలో చాలామంది చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం గురించి మనం వింటూనే ఉంటాం. అదే విధంగా తెలంగాణలో సైతం అధికారులే వేర్వేరు రంగాలకు చెందిన పరిశ్రమలను ఎంపిక చేసి వారంలో 3 రోజుల పాటు విద్యార్థులు పరిశ్రమలో పని చేసేలా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. 37 ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లలో, 66 ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లలో ఈ విధానం అమలులోకి రానుందని బోగట్టా.

ఎంపిక చేసిన పది కోర్సులలో చేరిన విద్యార్థులు నెలకు 10,000 రూపాయల వేతనం పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎంపిక చేసిన కాలేజ్ లలో ఒకటి లేదా రెండు కోర్సులకు మాత్రమే ఈ విధానం అమలులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విధానం పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. పేద విద్యార్థులపై ప్రయాణ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల భారం పెరుగుతోంది.

ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ స్కీమ్ ను అమలు చేయనున్నాయి. విద్యార్థులు ఇందులో చేరితే పరిశ్రమలకు హాజరైన హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.