జీర్ణక్రియ బాగుండాలంటే ఇవన్నీ తప్పనిసరి..!!

రోజువారీ జీవితంలో మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్న రోజులివి. చదువు, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్.. ఇలా ప్రతీ విషయంలోనూ టెన్షన్లే. ఇంతటి గజిబిజి జీవితంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆరోగ్యం కావాలి. అందుకు కొన్ని ఆహార నియమాలు, శారీరక శ్రమ చేయాలి. వాటిలో ముఖ్యమైనవి..

Digestion | Telugu Rajyam

ఆహారంలో షుగర్ పాత్ర తగ్గించాల్సిందే. సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లో షుగర్ ఎక్కువ. వీటిని తగ్గించడం అవసరం. రాత్రి డిన్నర్ ముగించిన తర్వాత మరునాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ వరకూ ఏమీ తినకుండా ఉంటే ఎన్నో జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. గట్ లైనింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఆల్కహాల్ తగ్గించడం ఎంతో ముఖ్యం. అప్పుడప్పుడూ తీసుకునే ఆల్కహాల్ వల్ల ఇబ్బంది లేదు. ఎక్కువయితే మలబద్దకం, కడుపుబ్బరం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

స్నాక్స్ లో భాగంగా బయటి చిరుతిండి కంటే.. పండ్లు, నట్స్ తీసుకోవచ్చు. ఇంట్లో చేసిన స్నాక్స్ అయితే పర్వాలేదు. ఆఫీసుకి, బిజినెస్ ట్రిప్స్ లో స్నాక్స్ ను ఇంటినుంచే తీసుకెళ్తే మరింత మంచిది. తలనొప్పి, ఒళ్లు నొప్పి.. ఇలా ఏదైనా మనం హోం మెడిసిన్ అంటూ ఏవేవో వాడేస్తాం. ఇందులో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. కానీ.. పెయిన్ కిల్లర్స్ గట్ హెల్త్ ని దెబ్బ తీస్తాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం తగ్గి తలనొప్పి రావొచ్చు. ఈ సారి తలనొప్పి వస్తే రెండు గ్లాసుల మంచినీరు తాగి చూడండి.

ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. కనీసం వారానికి 150 నిమిషాలైనా వ్యయామం చేయాలి. ఇది గట్ హెల్త్ కి, గుండెకి మంచిది. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్పోర్ట్స్.. ఏదైనా మంచిదే. ఒత్తిడి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ప్రోబయాటిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. మెడిటేషన్, యోగా ద్వారా ఒత్తిడి కి దూరంగా ఉండొచ్చు. ఒంటికి మంచి వ్యాయామం, ఆహారం ఎంత అవసరమో.. కంటికి సరైన నిద్ర అంతే అవసరం. జీర్ణక్రియకు మంచి నిద్ర అవసరం. అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర సరిగ్గా పట్టదు. వీటన్నింటికీ చెక్ పెడితే మంచి ఆరోగ్యం మన చెంతే ఉంటుంది.

 

గమనిక: ఆరోగ్య నిపుణులు పలు సందర్భాల్లో ఇచ్చిన అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలను అందించాం. ఆరోగ్య సమస్యలు, ఆహారం విషయంలో ఆరోగ్య నిపుణులు, డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. గమనించగలరు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles