మనలో చాలామంది తిప్పతీగ గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో భాగమైన మొక్కలలో తిప్పతీగ ఒకటి కావడం గమనార్హం. సాధారణం అనిపించే ఎన్నో మొక్కల్లో ఒకటైన తిప్పతీగ ద్వారా అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తమలపాకులాగా తీగలు అల్లుకుని ఉండే తిప్పతీగ ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెప్పవచ్చు.
తిప్పతీగ ఆకులు, వేర్లు, కాండం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం గమనార్హం. తిప్పతీగ ద్వారా గిలోయ్ అనే గ్లూకోసైడ్, టెనోస్పోరిన్, పామరిన్, టెనోస్పోరిక్ యాసిడ్ లభించడంతో పాటు ఐరన్, భాస్వరం, జింక్, కాపర్, కాల్షియం, మాంగనీస్ కూడా శరీరానికి లభిస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
ఆమ్లత్వం, అజీర్ణం, మూత్ర సమస్యలను తిప్పతీగ ద్వారా దూరం చేసుకునే అవకాశం ఉండగా జ్వరం, మధుమేహం, కామెర్లు, కీళ్లనొప్పులు, మలబద్ధకం సమస్యలు సైతం తిప్పతీగ ద్వారా దూరమవుతాయి. వాత, పిత్త, కఫాతో బాధపడుతున్న రోగులకు తిప్పతీగ దివ్యౌషధం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. విష పదార్థాలను, హానికరమైన పదార్థాలను తొలగించడంలో తిప్పతీగ తోడ్పడుతుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తిప్పతీగలో ఉండటంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. తిప్పతీగ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. తిప్పతీగ ఇన్సులిన్ ఉత్పత్తి, సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే అవకాశాలు ఉంటాయి.