నెయ్యి తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఇవే.. ఆ సమస్యలకు చెక్!

మనలో కొంతమంది నెయ్యి తినడానికి ఎంతగానో ఇష్టపడితే మరి కొందరు మాత్రం నెయ్యి తినడానికి అస్సలు ఇష్టపడరు. భారతీయ వంటకాలలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. బిర్యానీ, స్వీట్లలో కూడా నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రతిరోజూ నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతామని చాలామంది ఫీలవుతారు.

చలికాలంలో నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పరగడుపున చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా పీహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో నెయ్యి తోడ్పడుతుందని చెప్పవచ్చు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడంలో నెయ్యి ఉపయోగపడుతుంది.

దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి చెక్ పెట్టడంలో నెయ్యి తోడ్పడుతుందని చెప్పవచ్చు. నెయ్యి తీసుకోవడం ద్వారా విటమిన్ ఎ, ఇ, డి, కె లభిస్తాయి. నెయ్యి తీసుకుంటే ఒమేగా 3 , ఒమేగా 6 కూడా లభించే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో నెయ్యి తోడ్పడుతుంది. నెయ్యికి స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. వాపును తగ్గించి నిద్రలేమికి చెక్ పెట్టడానికి నెయ్యి తోడ్పడుతుంది.

నెయ్యి తీసుకోవడం ద్వారా హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం సాధ్యమవుతుంది. నెయ్యి తీసుకుంటే శరీరానికి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ లభించే అవకాశాలు ఉంటాయి. నెయ్యిలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు నెయ్యిని తీసుకుంటే మంచిది. నెయ్యి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.