దెయ్యాలను వదిలించే గుడి ఇదే.. ఈ గుడికి వెళితే అన్ని పాపాలు పోతాయట!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొన్నిసార్లు మనలో కొంతమంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. గణగాపూర్ దత్తాత్రేయ గుడిని సందర్శించడం ద్వారా కష్టాలు కచ్చితంగా తీరతాయని చెప్పవచ్చు. ఈ గుడి కర్ణాటక రాష్ట్రంలోని పాపులర్ గుడులలో ఒకటి కావడం గమనార్హం. త్రిమూర్తుల ఏకీకృత స్వరూపం దత్తాత్రేయ స్వామి మన కష్టాలను కచ్చితంగా తీరుస్తారని చాలామంది నమ్ముతారు.

 

ఈ గుడికి వెళితే దెయ్యాలు సైతం వదులుతాయని, మానసిక సమస్యలు సైతం దూరమవుతాయని బోగట్టా. ఈ దేవుని ముఖ వర్చస్సు చూస్తే భూతపిశాచాలు గజగజా వణుకుతాయని సమాచారం. రోడ్డు మార్గంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ గుడికి చేరుకోవచ్చు. తల్లీదండ్రులే దైవాలు అని దత్తాత్రేయ స్వామి చెప్పారు. ఈ స్వామి ఎన్నో అద్భుతమైన జ్ఞాన సంపదలను మనకు అందించడం గమనార్హం.

 

ఈ ఆలయంలో వైష్ణవ సంస్కృతికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఈ ఆలయంలో శైవులకు కూడా సరైన గౌరవం దక్కుతుంది. ఈ గుడికి వెళితే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో కొన్ని భయానక ఘటనలు సైతం ఎదురవుతాయి. అయితే దేవునిపై దృష్టి కేంద్రీకరిస్తే మాత్రం ఆ ఘటనలు మనల్ని భయపెట్టవు. ఈ గుడికి వచ్చిన కొంతమంది భక్తులు కేకలు పెడతారు.

 

అయితే ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేకుండా ఆందోళనలు తగ్గి దేవుడి ఆశీర్వదాలను తీసుకోవచ్చు. సాధారణ ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెళితే మన అభిప్రాయాలు సైతం మారిపోతాయి. కచ్చితంగా జీవితంలో ఒకసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది.