రాతపరీక్ష లేకుండా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ పోస్టుల భర్తీకి ఈ సంస్థ రిక్రూట్మెంట్ మొదలుకావడం గమనార్హం. అసిస్టెంట్ డైరెక్టర్ 5 ఉద్యోగ ఖాళీలను, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 6 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. fssai.gov.in వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జులై నెల 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ విభాగాల్లో 6 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక జరగనుందని సమాచారం అందుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వాళ్లకు రూ. 51,100 వరకు జీతం లభించనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.