డెంగ్యూ వ్యాధినీ నియంత్రించాలా… అయితే ఇవి ఫాలో కావాల్సిందే?

వర్షాకాలం మొదలైంది. ఈ సంవత్సరంలో వర్షాలు భారీగా కురిసి పలు ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాకాలం మస్తు రోగాలను వెంటబెట్టుకొని వస్తుంది. వర్షాల కారణంగా అక్కడక్కడ నీరు నిల్వ ఉండటం వల్ల వాటిలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ దోమల వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే ఈ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతాయి. అందువల్ల ఈ వ్యాధులను నియంత్రించే ఆహారపదార్థాలను తరచు మనం తీసుకోవాలి. డెంగ్యూ వ్యాధి సోకిన వారు తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డెంగ్యూ వ్యాధి సోకినవారు ఆ వ్యాధి నుండి తొందరగా కోలుకోవడానికి తరచూ శక్తి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన వారు నీరు ఎక్కువగా తాగుతూ చక్కెర లేకుండా తయారు చేసిన పళ్ళ రసాలను తరచు తాగుతూ ఉండాలి. బొప్పాయి ఆకులు మెత్తగా రుబ్బి వాటి నుండి రసం తీసి ప్రతిరోజు ఒక గ్లాస్ బొప్పాయి ఆకు జూస్ తాగటం వల్ల డెంగ్యూ నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా బాగా పండిన బొప్పాయి పండ్లను కూడా ఎక్కువగా తినాలి. ఇక మన ఇంట్లో ఉండే మెంతులు కూడా డెంగ్యూ వ్యాధి నివారణలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ మెంతులు ద్వారా శరీరంలో వ్యాధి నిరోధిక శక్తి పెరుగుతుంది. మెంతులలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం, సాయంత్రం ఆ నీటిని తాగడం వల్ల డెంగ్యూ వ్యాధి నుండి విముక్తి పొందవచ్చు.

డెంగ్యూ వ్యాధి నివారణలో తిప్పతీగ రసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని గిలోయ్ జ్యూస్ అని కూడా అంటారు. ఈ తిప్పతీగ జ్యూస్ తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించటమే కాకుండా రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచుతుంది. డెంగ్యూ వ్యాధితో బాధపడేవారు రెండో తిప్పతీగ కాడాలను వేసి ఒక గ్లాసు నీటిని పోసి బాగా మరిగించాలి. ఆ నీళ్లను చల్లారిన తర్వాత గోరువెచ్చగా తాగాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇలా చేయటం వల్ల డెంగ్యూ వ్యాధి నివారించవచ్చు. ఇక జామ పండ్ల ఆకులనుండి తయారుచేసిన జ్యూస్ కూడా డెంగ్యూ వ్యాధి నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఈ జామ ఆకులను విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల జామ ఆకులను మెత్తగా రుబ్బి దాని నుండి తీసిన జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ వ్యాధి నుండి బయటపడవచ్చు.