కాళ్ల పగుళ్ల సమస్య ఎక్కువగా వేధిస్తుందా.. ఈ అద్భుతమైన చిట్కాలతో శాశ్వత పరిష్కారం!

వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో కాళ్ల పగుళ్ల సమస్య కూడా ఒకటని చెప్పవచ్చు. కాళ్ల పగుళ్లను తగ్గించడానికి కొన్ని క్రేజీ చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పగుళ్లపై బరువైన క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ (వాసెలిన్, అక్వాఫోర్ హీలింగ్ ఆయింట్‌మెంట్‌మెంట్ రాసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని రాస్తే కాళ్ల పగుళ్లు సులభంగానే తగ్గుతాయని చెప్పవచ్చు. ఆలోవెరా జెల్ కూడా కాళ్ల పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అరటిపండు గుజ్జును పగుళ్లకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా కాళ్ల పగుళ్ల సమస్య దూరమవుతుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటిలో పాదాలు ఉంచడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

రోజ్ వాటర్‍‌లో పాదాలను కాసేపు ఉంచినా కూడా నొప్పి సులభంగానే తగ్గుతుంది. మంచినీటిని ఎక్కువగా తాగడంతో పాటు ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం తక్కువ నూనెలను ఉత్పత్తి చేస్తుంది మరియు తేమను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడినా, నడిచినా పాదాలపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పవచ్చు.

అరికాళ్ళకి కొబ్బరి నూనె లేదా ఆముదం రాసి 30 నిమిషాలు మన అరికాళ్ళు గోరువెచ్చని నీటిలో ఉంచడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అరగంట తర్వాత కాళ్ళు క్లీన్ చేసుకునే రాయితో క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ తో అద్దితే 10 రోజుల్లో ఈ సమస్య శాశ్వతంగా దూరమవుతుందని చెప్పవచ్చు.