రాగులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

మనకు అందుబాటులో ఉండే చిరుధాన్యాలలో రాగులు ఒకటి కాగా చాలామంది రాగులను ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. రాగులు తీసుకోవడం ద్వారా కాల్షియం, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు సైతం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. రాగి సంగటి, రాగి అంబలి తయారు చేసుకోవడానికి సైతం రాగులను ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. రాగులను తీసుకోవడం ద్వారా ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ లభిస్తాయి.

గ్లూటెన్ ఫ్రీ ఆహారం. గ్లూటెన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలెర్జీ ఉన్నవారు, ఉదరకుహుర వ్యాధి ఉన్నవారు రాగులను తీసుకోవచ్చు. పాలు తీసుకోని వారు రాగులను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియంలను అందించడంలో రాగులు తోడ్పడతాయి. రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండగా బరువు తగ్గడానికి రాగులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేయడంలో ఇవి తోడ్పడతాయి. మధుమేహం ఉన్నవారికి రాగులు చాలా అద్భుతమైన ధాన్యం కాగా రక్తంలో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండటంలో ఇది తోడ్పడుతుంది. రాగులలో ఉండే అమైనో యాసిడ్స్ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ నియంత్రణకు రాగులు తోడ్పడతాయి.

రాగులలో పాలీఫెనాల్స్, టానిన్లు, పైటేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి వ్యాధులను నివారించడంలో రాగులు ఉపయోగపడతాయి. రాగులు తీసుకోవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు.