40 ఏళ్లు దాటిన మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే.. ఇలా చేస్తే ఎన్నో లాభాలు!

ఈ మధ్య కాలంలో వయస్సుతో పాటు మహిళలను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నలభై ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండాలంటే కష్టమైన వ్యాయామాలు చేయడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు. క్రంచెస్‌, కార్డియో వర్కవుట్స్‌, మోకాళ్ల కండరాలపై ఒత్తిడి చేసే వ్యాయామాలు, పుషప్స్‌ చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 40 ఏళ్లు దాటిన వాళ్లను వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

శరీరం చురుగ్గా ఉంచుకోవాలంటే శారీరక శ్రమ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ నడక అలవాటు చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. జాగింగ్‌ చేసినా మంచి ఫలితాలు పొందడంతో పాటు సులభంగా హానికరమైన కొవ్వును తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది.

తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల మెటబాలిజమ్‌ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నొప్పులు, వాపులతో బాధపడుతుంటే క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. సైక్లింగ్‌ చేయటం వల్ల కూడా శరీరం ఫిట్ గా ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గృహిణులు ఇంట్లో చేసే పనులూ మంచి వ్యాయామాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. నొప్పులు, మోకాళ్ల వాపులు ఉండే వాళ్లు వర్కవుట్స్‌ కంటే యోగాను ఆశ్రయించడం ద్వారా మెరుగైన ఫలితాలను కచ్చితంగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.