మనలో చాలామంది మఖానాను ఎంతో ఇష్టంగా తింటారు. మఖానాను ఫాక్స్ నట్స్, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోషకాలు, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయని చెప్పవచ్చు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో మఖానా తోడ్పడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారికి మఖానా ఎంతగానో ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటు ఉన్నవాళ్లు మఖానా తినడం వల్ల ఆ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపు నుండి రక్షించడంలో మఖానా ఉపయోగపడుతుంది. మఖానా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పవచ్చు. రక్తంలోని షుగర్ ను కంట్రోల్ చేయడంతో పాటు బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
మఖానా మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు. మఖానా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. మఖానా గింజలు మరియు రేకులు తక్కువ సోడియం మరియు అధిక పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహితంగా ఉంటాయి. ప్రోటీన్ లోపంతో బాధ పడేవాళ్లు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. మఖానాతో వేరుశనగలు తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.
మఖానాను పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా చర్మం, జుట్టు ప్రయోజనకరంగా ఉంటుంది. పాలలో మఖానా కలిపి తీసుకోవడం ద్వారా నిద్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మఖానాలో బాదం కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎన్నో లాభాలు చేకూరుతాయి. మఖానా విత్తనాలు సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.
ప్రోటీన్, ఫైబర్, ఓమేగా3 మఖానాలో ఎక్కువగా ఉంటాయి. మఖానాతో పాటు చియా గింజలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
