బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా బాదం పప్పులు తింటే కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. బాదం పప్పును ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, కిడ్నీలో రాళ్లు, ఊబకాయం, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బాదం పప్పును ఎక్కువగా తినడం వల్ల కొంతమందికి అలర్జీ రావచ్చు. దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు వస్తాయి.
బాదం పప్పులో ఆక్సలేట్ ఉంటుంది, ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదం పప్పును పరిమితంగా తినడం మంచిది. బాదం పప్పును ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పు వంటివి సాధారణంగా కనిపిస్తాయి. బాదం పప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
బాదం పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్య ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని బాదం పప్పులు సైనైడ్ ను ఉత్పత్తి చేస్తాయి, కానీ సాధారణంగా అది హానికరం కాదు. అయితే ఎక్కువ మొత్తంలో బాదం పప్పును తినడం వల్ల సైనైడ్ విషపూరితం కావచ్చు. బాదం పప్పును ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, అలసట, మైకం వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది.
బాదం పప్పులో పోషకాలు ఉన్నప్పటికీ, మితంగా తినడం ముఖ్యం. ఒక రోజుకు 6 బాదం పప్పులు తినడం మంచిది. బాదం పప్పును తినడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు నష్టాలను కూడా తెలుసుకోవడం ముఖ్యం అని చెప్పవచ్చు. చర్మంపై దురద, ఎర్రటి మచ్చలు, శ్వాస కోస సమస్యలతో బాధపడేవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు. బాదం పప్పు తినడం వల్ల ఈ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు