బాల్కనీలో పక్షుల బెడదకు సులువుగా చెక్ పెట్టాలా.. ఈ క్రేజీ చిట్కాలు పాటిస్తే చాలు!

పక్షుల బెడదకు చెక్ పెట్టడానికి, పక్షులను భయపెట్టే వస్తువులు, రసాయనాలు, ఆహార వనరులను మార్చడం చేయవచ్చు. బాల్కనీలో పక్షుల వల్ల మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడే ఉంటారు. పక్షులు మరీ ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నట్టయితే వలలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. పక్షులను భయపెట్టడానికి, మెరిసే వస్తువులను ఉపయోగించవచ్చు.

మిరపకాయ, వెల్లుల్లి ఘాటైన వాసనలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటి వాసనలను పీలిస్తే సైతం పక్షులు దూరమవుతాయి. ద్ద, నక్క వంటి వేటాడే పక్షుల బొమ్మలను ఉపయోగించడం పక్షులను భయపెట్టడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా కూడా పక్షుల సమస్యను దూరం చేసుకోవచ్చు. మిరపకాయ పొడిని నీరు, వెనిగర్ తో కలిపి, ఆ మిశ్రమాన్ని పక్షులు ఉండే ప్రదేశాలకు చల్లడం ద్వారా, పక్షులను తరిమికొట్టవచ్చు.

కొన్ని రసాయనాలు పక్షులను తరిమికొట్టడానికి ఉపయోగించవచ్చు, కానీ అవి పక్షులకు హాని కలిగించకుండా ఉండాలి. పక్షులకు ఆహారం ఇచ్చే ప్రదేశాలను తొలగించడం ద్వారా, పక్షులను తరిమికొట్టవచ్చు. పక్షులకు ఆకర్షణీయమైన ఆహార వనరులు (పండ్ల చెట్లు, కూరగాయలు) ఉంటే, వాటిని తొలగించడం ద్వారా పక్షులను తరిమికొట్టవచ్చు. పక్షులు చేరకుండా, గూడు కట్టుకోకుండా నిరోధించడానికి స్పైక్ లను వినియోగించవచ్చు.

పక్షులకు ఏ మాత్రం హాని కలగకుండా పక్షులను తరిమికొట్టే మార్గాలను అన్వేషించాలి. ఇంట్లో పెంపుడు జంతువులను పెంచడం ద్వారా కూడా ఈ సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. బాల్కనీలో మిరియాల పొడిని చల్లుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈజీ షాపింగ్ బజార్ బర్డ్ నెట్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.