రోజూ ఉదయాన్నే లీటర్ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

మనలో చాలామంది పరగడపున నీళ్లు తాగితే మంచిదని ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల ఎక్కువ సంఖ్యలో లాభాలు ఉన్నా కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. ఉదయం సమయంలో నీళ్లు తాగితే జీవక్రియలలో వేగం పెరగడంతో పాటు సులువుగా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిరోజూ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.

ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రోజువారీ పనుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల కడుపులో ఇబ్బంది, వికారం కలిగే అవకాశం ఉంటుంది. వైద్యుల సలహా ప్రకారం నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ నీళ్లు తాగితే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నీరు మీ కిడ్నీలోని యాసిడ్‌ను పలుచన చేయడం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలోని ప్రేగులను శుభ్రపరిచే విషయంలో నీళ్లు ఎంతో తోడ్పడతాయి.

హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే విషయంలో నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. వీలైతే గోరువెచ్చని లేదా వేడి నీటిని ఉదయం సమయంలో తీసుకుంటే మంచిది. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పవచ్చు.